Home / SLIDER / తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంది.

తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంది.

 స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సంద‌ర్భం ఇది.

ఈ చారిత్ర‌క సంబంధాన్ని పుర‌స్క‌రించుకొని స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. ప్ర‌తి ఇంటికి జాతీయ జెండాల‌ను ఉచితంగా పంపిణీ చేసింది. ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయ‌డంతో యావ‌త్ తెలంగాణ త్రివ‌ర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతోంది.

దేశ‌భ‌క్తిని చాటే అనేక కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటున్నాం. వేలాది మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు త‌మ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మ‌హానీయుల త్యాగాల వ‌ల్లే స్వాతంత్ర్య ఫ‌లాలు అనుభ‌విస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది అని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino