Home / SLIDER / కాళేశ్వరం పంప్ హౌజ్ లు మునగడం ప్రకృతి వైపరిత్యమా..?

కాళేశ్వరం పంప్ హౌజ్ లు మునగడం ప్రకృతి వైపరిత్యమా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో నిర్మించారు.  రాష్ట్ర వ్యాప్తంగా  కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో లక్ష్మి పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్   కీలకమైనవి. అయితే ఎన్నో ఏండ్ల తర్వాత కురిసిన అతి భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులో పంప్ హౌజ్ లు మునగడంతో ప్రతిపక్ష పార్టీలు ఇటు అధికార టీఆర్ఎస్ అటు ఆ ప్రాజెక్టును నిర్మించిన మెయిల్ (meil)పై విమర్షలు చేస్తున్నాయి. ఈ పంప్ హౌజ్ లు మునగడం ఎవరి తప్పు అనే అంశంపై ఒక లుక్ వేద్దాం . ప్రాజెక్టు నిర్మించే సమయంలొనే  మేడిగడ్డ బ్యారేజీ 106 మీటర్ల (ఓవర్ ఫ్లో) వద్ద ఉండేలా ప్లాన్ చేశారు.. దాని సామర్థ్యం 18 లక్షల క్యుసెక్కులు. దీని పక్కనే లక్ష్మీ పంప్ హౌజ్ ను నిర్మించారు.

ఏదైనా ప్రాజెక్టును కట్టేటప్పుడు పదేళ్లు & వందేళ్ల సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటారు. 1986లో అత్యధికంగా 36 లక్షల క్యుసెక్కుల వరద సంభవించింది. మళ్లీ 2086లో అదే తరహా పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ఉదాహరణకు తెహ్రీ డ్యాం నిర్మించేటప్పుడు 2000, 3000 సంవత్సరానికి సంబంధించిన డేటాను పరిగణలోకి తీసుకున్నారు. కానీ 2003లో భూకంపం సంభవించింది.

లక్ష్మీ పంప్ హౌజ్ గురించి:
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంప్ హౌజ్ మేడిగడ్డ పంప్ హౌజ్. గోదావరి నీళ్లను మొదటగా ఎత్తిపోసేది ఇదే. దేశంలోనే అతిపెద్దదైన ఈ పంప్ హౌజ్ ను కన్నెపల్లి దగ్గర నిర్మించారు. అప్రోచ్ ఛానల్ ద్వారా దీంట్లోకి నీరు వచ్చి చేరుతుంది. మేడిగడ్డ పంప్ హౌజ్ లో మొత్తం 17 మోటార్లను బిగించారు. ఒక్కో మోటార్ సామర్థ్యం 40 మెగావాట్లు కావడం విశేషం. ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న ఈ మోటార్లు అత్యద్భుతంగా పని చేస్తున్నాయి. 17 మోటార్లలో పదకొండింటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. మిగతా వాటిని భవిష్యత్ అవసరాల కోసం వినియోగించనున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు గ్రావిటీ ప్రెజర్ పైప్స్ ద్వారా డెలివరీ పాయింట్ కు చేరతాయి. అక్కడి నుంచి 34 పైపుల ద్వారా జలాలను గ్రావిటీ ప్రెజర్ కాలువలోకి పంపిస్తారు. అటు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీకి నీరు చేరుకుంటుంది. అక్కడే గోదావరిలో కలుస్తుంది. కన్నెపల్లి నుంచి వచ్చే గ్రావిటీ ప్రెషర్ కాలువ సామర్థ్యం 2 టీఎంసీలు కావడం విశేషం. ఈ కాలువ 365 రోజులూ నీటితో కళకళలాడుతూ ఉంటుంది.

పంప్ హౌజ్ ఎందుకు ముంపునకు గురైంది:

*) తక్కువ వ్యవధిలో భారీగా వరదలు రావడం

*) ఫ్రీ ఫ్లో లేకపోవడం

*) ఫోర్స్ బ్యాక్ వాటర్ రివర్స్

*) వర్షపాతం, వరదల స్థాయి సమాచారం గరిష్టంగా 100 ఏళ్లది తీసుకోవడం

*) జూలై 14న సంభవించిన వరదలకు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలే కారణం

*) లక్ష్మీ పంప్ హౌజ్ నీట మునగడం

*) వరదల సమయంలో దేశంలోని అనేక ప్రాజెక్ట్ పంప్ హౌజ్ లు ముంపునకు గురయ్యాయి

*) వరదలు అనేవి ప్రకృతి విపత్తులో భాగం

*) అమెరికా, చైనాలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి

*) వాతావరణంలో మార్పులు కూడా ఒక కారణం

ఇలా ప్రకృతి వైపరిత్యం తప్పా ఇటు ప్రభుత్వం కానీ అటు ఈ ప్రాజెక్టును నిర్మించిన మెయిల్ సంస్థ తప్పు ఏమి లేదని ..ప్రతిపక్షాలే అనవసరంగా విమర్షలు చేస్తున్నాయని ఆర్ధమవుతుంది.

కాళేశ్వరానికి ఎలాంటి నష్టం లేదు:

మునిగిపోయిన పంప్ హౌస్లో మోటారుకు అనుసంధానించబడిన పంపులు ఉంటాయి. ఆ పంపులు, మోటార్లను సరఫరా చేసిన BHEL, Xylem, Andridge వంటి కంపెనీలు వాటి నిర్వహణ బాధ్యత తీసుకుంటాయి. ఎందుకంటే ఆయా మిషన్లకు ఆ కంపెనీలు మెయింటెనెన్స్ వారంటీ ఇస్తాయి. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఆయా కంపెనీ ఇంజనీర్లు చూసుకుంటారు.

మోటార్లు, పంపుల్లో నీటిని తొలగించిన తర్వాత అందులో పేరుకుపోయిన మట్టి, ఇసుకను కూడా పూర్తిగా తీసేస్తున్నారు. అనంతరం సంబంధిత మెషీన్లను సర్వీసింగ్ చేసి తిరిగి వాటి స్థానాల్లో ఇన్ స్టాల్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే యధావిథంగా పని ప్రారంభిస్తారు. ఇదంతా అతి త్వరలో పూర్తవుతుంది.

MEIL గురించి:

ప్రారంభమైన నాటి నుంచి MEIL తన సత్తా చాటుతూ రికార్డులను సృష్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి మిషన్ ను 1367 గంటలు, రెండో మిషన్ ను 1703 గంటలు నిరంతరాయంగా నడిపి నీటిని ఎత్తిపోసింది. MEIL ఉత్పత్తి చేసిన ప్రతి పంపు సుమారు 3150 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat