కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం లాంటిదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారి పాలనలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. నిరుపేదలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారి మేలు కోసం గౌరవ సీఎం కేసీఆర్ గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారని అన్నారు.
ఎలాంటి విపత్తు వచ్చినా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి నిధులను మంజూరు చేస్తుందని అన్నారు. పైరవీలు, దళారుల మోసాలకు తావు లేకుండా అర్హులైన వారి ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.