తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి పెద్దపల్లికి చేరుకోనున్నారు.
మొదట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న పెద్దకల్వల వద్ద సుమారు నలబై తొమ్మిది కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుండి మంథనికి వెళ్ళే దారిలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నాం రెండు గంటలకు పెద్ద కల్వల దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు,