Political విజయవాడలో జరిగిన బీసీ మహాసభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధమే జరగబోతుందని అన్నారు..
విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభలో పాల్గొన్న సీఎం జగన్.. ఇంకొద్ది రోజుల్లో రాష్ట్రంలో యుద్ధం రాబోతుందని అన్నారు.. l. ‘ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీ, వెన్నుపోటుకి మధ్య జరగబోతుందని చెప్పండి. అలాగే మీకోసం నిలబడే ఒక అన్న ఉన్నాడని చెప్పండి మాట మీద నిలబడే ఒక నాయకుడు మీకోసం ఎల్లవేళలా పోరాడుతాడని తెలపండి… అలాగే ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య జరగబోతుందని చెప్పండి. పేదల భవిష్యత్తుకు, పేదలు పేదలుగానే మిగిలిపోవాలని తాపత్రయపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. ఈ యుద్దంలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే.. మరోవైపున బీసీల తోకలను కత్తరిస్తాను, ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వమున్న చంద్రబాబునాయుడికి మధ్య యుద్దం జరగబోతుందని చెప్పండి’ అంటూ బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపును ఇచ్చారు. ఈ మహాసభలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు వీరంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పొగడ్తల వర్షం కురిపించారు.. అలాగే బీసీల వెంట ఉండి బీసీలకు వినపడుతుంది నాయకుల్ని నమ్మొద్దని అన్నారు జగన్.. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ఇలాగే రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపిస్తామని అన్నారు