politics కరోనా వచ్చి ఇప్పటికీ దాదాపు 3 ఏళ్ళు అవుతున్న ఇప్పటికే ఈ వైరస్ ను నివారించలేకపోతున్నారు.. అయితే కరోనా చైనాలోనే మొదలైంది అనే వాదనలు వినిపించడమే కాకుండా మొదటి కేసు కూడా అక్కడే నమోదయ్యాయి.. అయితే ఇప్పటికే ఆ దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తుందని రోజుకు ఎన్నో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వీటిని అదుపు చేయటం తమ వల్ల కాదని చైనా ఆరోగ్య శాఖ చేతులు ఎత్తేసినట్టు సమాచారం..
కరోనాతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు.. అలాగే మొట్టమొదటిగా కరోనా కేసులు వెలుగు చూసిన చైనా కూడా ఎన్నో లక్షల మంది పౌరులను కోల్పోయింది అయితే ఇప్పటికే ఆ దేశంలో కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. రోజుకు ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయో ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యమై అంటూ ఆ దేశ ఆరోగ్యశాఖ తాజాగా తేల్చేసింది..
దీంతో గత నెలలో అత్యధిక కేసులు నమోదైన చైనాలో ఇప్పుడు ఎంతమంది వైరస్ బారినపడుతున్నారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కరోనా ఆంక్షలతో చైనా ప్రజలు అతలాకుతలమవుతున్నారు. వీరిపై తీవ్ర ఆంక్షలుండటంతో నిరసనలు వెలువెత్తుతున్నాయి.. కాంటాక్ట్ టెస్టుల విషయంలో నిబంధనను సడలించినప్పటికీ కరోనాను అదుపు చేయడంలో మాత్రం చైనా ప్రభుత్వం విఫలమవుతూనే వస్తుంది..
అయితే సడలించిన నిబంధనలతో వైరస్ సోకి లక్షణాలు లేనివారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు కూడా చేయించుకోవడం లేదు. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వీటన్నిటినీ చైనా ప్రభుత్వం అదుపు చేయలేక పోతుంది.. అయితే ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్న వారు ఎక్కువ అవడంతో ఇక కరోనా కేసులను ట్రాక్ చేయలేమంటూ చైనా ఆరోగ్య కమిషన్ బుధవారం ప్రకటించేసింది