Politics ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లక్ష్మీ నరసాపురానికి చెందిన దుర్గామల్లేష్, విజయ మధ్య కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.. అయితే వారి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయింది. ఈ జంట తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఆ తర్వా ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది..పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇంకా ఈ పెళ్లికి వీరందరూ ఒప్పుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెళ్లి పెద్ద అయ్యారు. ప్రేమికులకు దగ్గరుండి వివాహం జరిపించారు.
ఎన్నాళ్ళకి నుంచో ప్రేమించుకుంటున్న ఆ జంటకు ఇంట్లో వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు అంతేకాకుండా వారి ప్రేమను దూరం చేయాలని చూశారు.. ప్రేమించుకున్న జంట పెద్దలు ఒప్పుకోక విడిపోలేక ఆవేదన పడుతున్న సమయంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వారి ప్రేమకు పెద్దయ్యారు.. ఎన్నిసార్లు తమ ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళని ఒప్పించాలని ప్రయత్నించిన వారు ఎవరు ఒప్పుకోకపోవడంతో ఏమీ వారిద్దరూ ఎంతో మనోవేదనకు గురయ్యారు.. అయితే ఈ సమయంలో ఈ విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి వీరిద్దరిని ఒకటి చేశారు పెద్దలను ఒప్పించి వీరిద్దరికీ పెళ్లి చేశారు.. అంతరం దండలు మార్చుకున్న వీరిద్దరూ ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.. ఆ తర్వాత ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన ప్రేమజంట ఆశీర్వాదం తీసుకుంది. అనపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఈ ప్రేమ పెళ్లికి వేదిక కావడం విశేషం..