Politics ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన సామాజిక వర్గాలకు అనుగుణంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి ఎప్పటినుంచో వినిపిస్తున్న ఒక డిమాండ్కు సానుకూలంగా స్పందించారు..
తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ మరొక నిర్ణయాన్ని తీసుకుంది ఆంధ్రలో బీసీ సామాజిక వర్గాల నుంచి ఎప్పటినుంచో ఒక డిమాండ్ వినిపిస్తూ వస్తుంది ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అలాగే ఈ నిర్ణయాన్ని ఆనందంగా స్వాగతిస్తున్నాయి.. అది ఏంటంటే భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించింది ఏపీ ప్రభుత్వం..
బట్రాజులది పండిత కులమని.. వారిని యచకులుగా చూడటం తప్పు అంటూ ఈ పదాన్ని నిషేధించాలని చాలా కాలం నుండి ఆంధ్రాలో డిమాండ్ వినిపిస్తూ వస్తుంది.. అలాగే ఈ కులానికి సంబంధించిన ఎందరో ఒకప్పుడు దేశానికి సేవ చేశారని అలాగే నన్నయ్య భట్టారకుడు, నారాయణభట్టు, డిండిమభట్టు, కుంకుమభట్టు వంటి కవులు ఈ కోవకు చెందినవారేనని, అలాంటి కులాన్ని కించపరిచడం సరైంది కాదంటూ ఇప్పటివరకు వాదనలు వినిపించాయి.. ఈ విషయంపై రాష్ట్రం తాజాగా ఈ పదాన్ని ఎవరు పలకకూడదంటూ నిషేధం విధించింది.. అలాగే చివరికి సినిమాలు టీవీ సీరియల్ లో కూడా కనిపించకూడదని రాజకీయ ప్రసంగాల్లో సైతం ఈ పదాన్ని వాడటం నిషేధం అంటూ చెప్పింది.. ఈ విషయంపై ప్రస్తుతం వీరంతా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ప్రభుత్వం వారికి తగినంత గౌరవాన్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు..