Politics భాజపా అధికార ప్రతినిధి గౌరవభాటియా తాజాగా గాంధీ కుటుంబం పై తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలోనే అత్యంత అవినీతిమయ కుటుంబం గాంధీ కుటుంబం అంటూ చెప్పకు వచ్చారు.. సోనియా గాంధీ అల్లుడు వాద్రా పై అవినీతి మనీలాండరింగ్ ఎన్నో కేసులు ఉన్నాయని వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారని అన్నారు..
గాంధీల కుటుంబం భారతదేశంలోనే అత్యంత అనైతిక అవినీతిమయ కుటుంబం అన్నారు బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మొదటి నుంచి గాంధీల కుటుంబం అవినీతికి పాల్పడుతుందని చెప్పుకొచ్చారు అలాగే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ అదిరా పై మనీలాండరింగ్ కేసును కొట్టివేసేందుకు తాజాగా రాజస్థాన్ హైకోర్టు నిరాకరించడానికి కూడా ప్రస్తావిస్తూ ఈ విషయంపై సోనియా రాహుల్ ఎందుకు నోరు విట్టడం లేదని అన్నారు వాద్రా పై అవినీతి మనీలాండరింగ్ ఎన్నో కేసులు ఉన్నాయని వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారని అన్నారు..
అలాగే “భారత రాజకీయాల్లో సోనియాది అత్యంత అవినీతిమయ, అనైతిక కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. 2008 నుంచి 2013 మధ్య రాబర్ట్ వాద్రా రాజస్తాన్‌లో భారీగా భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. అప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. దాంతో రాబర్ట్ కన్నుసన్నల్లో ల్యాండ్ మాఫియా నడిచింది. చట్టానికి అతీతులమని అనుకుంటున్న గాంధీల కుటుంబం.. ఇప్పుడు అదే చట్టం ముందు నిలబడేందుకు వణికిపోతోంది.. వీటన్నిటిపై సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారు..” అన్నారు