Politics శుక్రవారం తెల్లవారుజామున మోదీ తల్లి హీరాబెన్ మృతిచెందారు.. ఈ విషయం తెలిసిన వెంటనే మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని తల్లి అంతక్రియలు పూర్తి చేశారు అలాగే ఆ వెంటనే తన విధుల్ని నిర్వహించడానికి మళ్లీ ఢిల్లీ వెళ్ళిపోయారు ఇది చూసిన వారంతా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు..
మోడీ దేశానికి ప్రధాని అయ్యారంటే ముఖ్య కారణం అతనిలో ఉండే నిబద్ధత అతని ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు.. నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. పర్సన్ లాస్ట్ అని. ఈ మాటలు మోదీ చెప్పడమే కాదు దాన్ని స్వయంగా ఆచరించి ఎన్నోసార్లు చూపించారు మరొకసారి ఇదే విషయాన్ని నిరూపించారు ప్రధాని..
ఆయన తల్లి శుక్రవారం మరణించారు ఈ విషయం తెలుసుకున్న అతను అహ్మదాబాద్ చేరుకొని తల్లి అంత్యక్రియలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పూర్తి చేశారు ఆ వెంటనే మళ్ళీ ఢిల్లీ ప్రయాణమయ్యారు..శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. ఉదయం 6 గంటలకు మరణ వార్త అందరికీ తెలిసింది. తల్లి మరణవార్త తెలియగానే మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. 9 గంటల 30 నిమిషాలకు సామాన్యుడిలా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తల్లి పాడె మోసి..చితికి నిప్పంటించారు ప్రధాని మోదీ.. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా తన తల్లిని సాగనంపారు మోది దేశానికి ప్రధాని అయినప్పటికీ ఆయన తల్లి అంత్యక్రియలు వేరే రకంగా జరుగుతాయని అందరూ ఊహించుకున్నారు కానీ ప్రశాంతంగా అయినా పూర్తి చేసిన తీరు అందర్నీ నివ్వెరరిచింది.. అంతేకాకుండా అదే రోజు ఉదయం 11 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యారు..