Home / HYDERBAAD / భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం

భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం

రేపు బ్లాక్‌ డే సందర్భంగా ఉప్పల్‌ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. కాగా భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్‌ డే నేపథ్యంలో మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో అజహారుద్ధీన్‌ నేతృత్వంలో తొలిసారిగా నిర్వహిస్తున్న మ్యాచ్‌ ఇది, ఈ మ్యాచ్‌ కోసం అన్ని విధాల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా మ్యాచ్‌ను అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మ్యాచ్‌ కోసం సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జాతీయ పతాకం తప్ప మరే ఇతర జెండాలను, బ్యాగులు హెల్మెట్లు, లైటర్లు, సిగరెట్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్నులు బైనాక్యులర్స్‌, ఆహర పదార్థాలు స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం అని ఆయన అన్నారు. ఉప్పల్‌ మ్యాచ్‌ కోసం 1800 మంది పోలీసులు భద్రతా విధుల నిమిత్తం రంగంలోకి దింపుతున్నామని మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు.