భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గవర్నర్ల నియామకంలో భాగంగా తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ను ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పించి ఆ రాష్ట్ర గవర్నర్‌గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ రాష్ట్ర గవర్నర్‌గా గంగాప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బి.డి. మిశ్రా, బీహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ నియమిస్తున్నట్లు ఆదేశాలను జారీచేశారు .
అండమాన్, నికోబార్ దీవులు లెఫ్టినెంట్ గవర్నర్‌గా దేవేంద్ర కుమార్ జోషిని నియమించారు. ప్రొఫెసర్ జగదీష్ ముఖి స్థానంలో దేవేంద్ర కుమార్ జోషి నియామకం అయ్యారు. జగదీష్ ముఖిని అసోం గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ..