డార్జిలింగ్‌లో జరిగిన పేలుళ్లపై గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చీఫ్ గురుంగ్, మరికొందరిపై పశ్చిమబెంగాల్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. డార్జిలింగ్‌లోని పలు ప్రదేశాల్లో పేలుడు ఘటనలు జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలు మరువక ముందే డార్జిలింగ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కాగా, ఈ రోజు జీజేఎం ఆయుధగారంపై పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసుల రాకను ముందుగా పసిగట్టిన జీజేఎం కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునేలా వారి.. వారి ప్రణాళిక అమలు పర్చారు. దీంతో పోలీసులు, జీజేఎం కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షనలో పోలీస్ సహా ఆందోళన కారుడు మృతి చెందాడు.
అయితే, గూర్ఖాలాండ్ ప్రత్యేకరాష్ట్రం కోరుతూ జీజేఎం ఆందోళనలను ఉధృతం చేస్తోంది.
