గత రెండు వారాల నుంచి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. బెంగళూరునూ ముంచెత్తుతున్నాయి. కర్నాటక రాజధాని బెంగళూరును శనివారం ఉదయం భారీ వర్షాలు ముంచెత్తాయి. బెంగళూరు నగర వీధులన్నీ భారీ వర్షానికి జలమయమయ్యాయి. ఉత్తరహళ్లి బస్‌స్టేషన్ సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. జేపీ నగర్, డాల్లర్స్ కాలనీ, కోరమంగళ తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో రోడ్లపై భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు సగానికి సగం వరద నీటిలో మునిగాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానగర పాలిక్) పిలుపునిచ్చింది.
