సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలాపనపై సుప్రీం కోర్టు పునరాలోచించేందుకు సిద్ధమైంది. సినిమా థియేటర్లలో ప్రతి షో ముందు జాతీయ గీతం తప్పనిసరిగా ప్లే అయ్యేలా చూడాలని గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. దేశ భక్తి చాటుకోవడానికి జాతి వ్యతిరేకులు కాదని నిరూపించుకోడానికి ఇలా చేయనక్కర్లేదంటూ తాజాగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతంపై మీ అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయం వచ్చాక సుప్రీం కోర్టు థియేటర్లలో జాతీయ గీతం ఆలాపనపై తుది నిర్ణయం ప్రకటించనుంది.
