దేవ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు దశాబ్దాలుగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ ఈ సారి సంప్రదాయం పాటించలేదు. గుజరాత్లో వరద సహాయక చర్యలు జరుతుగున్నాయని అందుకే ప్రకటించలేదని సమర్ధించుకుంది.
కానీ, ప్రతిపక్షాలు మాత్రం మోడీ టూర్లో హామీలకు అడ్డంకి లేకుండా చేశారని విమర్శించాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేదనే కారణంతో ఈసీని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు కేంద్రంతో కుమ్మక్కైందని ఆరోపించాయి. అయితే ఇంత గొడవ జరుగుతుందని ఈసీ ఊహించలేదు. దీంతో సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అయింది. కోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని తప్పుబడితే.. ఇంకా డ్యామేజ్ తప్పదని గమనించిన ఎన్నికల సంఘం ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు జరుగుతాయి. జనవరి 23తో శాసన సభ గడువు ముగుస్తుంది.