భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ. మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు బాగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సంస్కరణల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాల ఫలితాలు అందుతాయన్నారు. ఈ మూడేళ్లలో మన దేశం ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై బలంగా ప్రభావం చూపుతున్నాయన్నారు. విదేశీ మారకం నిల్వలు 400 మిలియన్లకు చేరాయని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్ రంగానికి 2.17 లక్షల కోట్ల రూపాయలు సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో లక్షా 35వేల కోట్లను బ్యాంకు బాండ్ల ద్వారా సేకరించనుంది కేంద్ర ప్రభుత్వం.
