ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాలనపై బీఎస్పీ అధినేత్రి మాయవతి సెటైర్లు వేశారు. దేవాలయాల్లో పూజలు చేసుకున్న తరువాత సమయం ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారంటూ ఆరోపించారు. నిజాంగఢ్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మాయావతి ఆదిత్యనాథ్ వెనుకబడిన పుర్వాన్‌చల్ నుంచి వచ్చిన నేతేనని, అయినప్పటికీ ఆయన ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. యోగి ఎప్పుడూ ఆలయాల్లోనే కనిపిస్తున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ పాలనలో నవ భారతం సాధ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాద్ పార్టీ బీజేపీ మరింత దారుణంగా ఉందని ఆమె విమర్శించారు.
