నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ.. నాలుగు రాళ్లు సంపాదించుకుందామనుకున్న వంట మనిషిని కామాంధుడు కాటేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువతిలో.. లేని పోని కోర్కెలు రేపాడు. ఓ పక్క తనతో వంట చేయించుకుంటూ.. మరో పక్క తన కామ వాంఛను తీర్చుకున్నాడు ఓ ఇంటి యజమాని. పని మనిషిగా ఇంట్లో చేరిన ఆ యువతి గర్భం దాల్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని భీవాండిలో చోటు చేసుకుంది.
కాగా ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఓ యువతిని సాక్షాత్తూ యజమాని పెళ్లాడతానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని భీవాండి నగరంలో వెలుగుచూసింది.
భీవాండి నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యువతిని వంటమనిషిగా పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లైంగికంగా లొంగిదీసుకున్నాడు. దీంతో ఆ యువతి కాస్తా గర్భవతి అయింది.
తాను గర్భవతిని అయ్యానన్న విషయం తెలుసుకున్న ఆ యువతి… పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అతని నిజస్వరూపం వెల్లడైంది. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
