ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే.. పదే అనే మాట ఒక్కటే.. నేను అవినీతికి దూరం. నాదంతా ట్రాన్స్‌రెన్సీ. ప్రతీ ఏటా ప్రకటిస్తున్నాను కదా..! నా లాగే ప్రతీ రాజకీయ నాయకుడు కూడా ఆస్తులను ప్రకటించాలి అంటూ మీడియా ముందు ఊదరగొడతాడన్న విషయం అందరికీ తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీ సంవత్సరం ప్రకటించే ఆస్తుల లెక్క తరుగుతుందే తప్పా.. పెరగను కాక.. పెరగదు.
ఇక అసలు విషయానికొస్తే.. సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ అక్షరాల లక్ష కోట్లు. ఇవిగో ఆధారాలంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ వార్త చెప్పిన ఆధారాలేంటి.. అవి వాస్తవమా..? కాదా..? అన్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే..
చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులుకు వైట్ క్యాష్ రూపంలో కంపెనీల నుంచి అందే ఆదాయం సంవత్సరానికి రూ.15 కోట్లు. అంతేకాదు. తెలుగుదేశం ప్రభుత్వం అలా అధికారంలోకి వచ్చిందో.. లేదో ఆ వెంటనే హెరిటేజ్‌కు డివిడెండ్స్ ఎక్కువగా వస్తుంటాయన్నది జగమెరిగిన సత్యం. అయితే, నారా వారి కోడలు బ్రాహ్మణి, భువనేశ్వరిలకు వచ్చేది తొమ్మిది కోట్ల 50 లక్షల 49 వేల రూపాయలు. అందులో
వారికి ట్యాక్స్ ఫ్రీ ఇన్‌కమ్ 9 లక్షలా 49వేలు ఇచ్చినట్లు హెరిటేజ్ సంస్థే ఒప్పుకుంది.
ఇకపోతే హెరిటేజ్‌లో నారా కుటుంబం షేర్స్ 89 లక్షల చిల్లర. ఒక్కొక్క షేర్ విలువ రూ.4లు, అంటే నారా కుటుంబం షేర్స్ విలువ రూ.3.6 కోట్లు అన్నమాట. అందులో భువనేశ్వరి పేరు మీద 53 లక్షలు, లోకేష్ షేర్స్ 23 లక్షలా 30వేలు.
అలాగే, చంద్రబాబు నాయుడు పేరు మీద మెగా బిడ్ అనే ఫినాన్స్ కంపెనీ ఉంది. ఇందులో చంద్రబాబు షేర్స్ 12 లక్షల 23వేలు. బ్రాహ్మణి పేరు మీద లక్షా 21 వేల షేర్స్.
చంద్రబాబు నాయుడుకు, లోకేష్‌కు ఏడాదికి వచ్చిన జీత భత్యాలు దాదాపు కోటన్నర వరకు ఉంటాయి. అంతేకాకుండా రెంట్స్ అవి.. ఇవీ.. అన్నీ కలిపి మొత్తం కలిపి రూ.15 కోట్ల ఆస్తులు ఉంటే.. ఏ ఒక్కరికి కూడా ఆస్తుల విలువ పెరిగినట్లు చంద్రబాబు, లోకేష్ గాని ఎవ్వరూ చెప్పరు. ఒక్క సంవత్సరంలో 15 కోట్ల ఆదాయం ఉన్న ఫ్యామిలీని బీద ఫ్యామిలీ అని మనం అనాలా..!!!
మరోపక్క చంద్రబాబు అధికారంలో రాగానే హెరిటేజ్ కంపెనీ లాభాల్లోకి వస్తుంది. అంతేకాకుండా హెరిటేజ్.. కంపెనీలను కొనుక్కుంటూ వెళ్తుంది. అందులో భాగంగానే 24 మే 2016 తేజ డైరీ అనే ఒక కంపెనీకి చెందిన అస్తులన్నింటినీ వీరు కొనుక్కున్నారు. అలాగే ఢిల్లీ బేస్డ్ వామన్ డైరీ అనే కంపెనీని హెరిటేజ్ సంస్థ 15 నంబంబర్ 2017 క్యాష్ డీల్‌తో కొన్నారు కూడాను.
ఇక్కడ మరో విశేషమేమంటే.. గత మూడు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న కంపెనీలన్నింటిని రిలయన్స్ కంపెనీ కొంటుంటే.. రిలయన్స్ కంపెనీని చంద్రబాబు కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పంకజ్ మోహన్ అనే బఢా పారిశ్రామిక వేత్త నుంచి కంపెనీని 2017 ఏప్రిల్‌లో కొన్నట్లు హెరిటేజ్ చెప్పింది.
ఏకంగా రిలయన్స్‌కు చెందిన కంపెనీనే కొన్న చంద్రబాబు నాయుడు పేదవాడా..? ధనికుడా..? మీరే చెప్పాలి.