దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచారం గుట్టుచప్పుడుకాకుండా జరుగుతుంటాయి. ఎన్ని సార్లు పట్టబడిన అలాగే వ్యభిచారం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆగ్రా నగరంలో సాక్షాత్తూ హోటల్ యజమాని కాలేజ్ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నిర్వహించిన బాగోతాన్ని ఆగ్రా పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. అదీకూడా కాలేజీ అమ్మాయిలతో కలిసి ఈ వ్యభిచార గుట్టును కొనసాగించడం గమనార్హం. ఆగ్రా నగరంలోని ఓ హోటల్‌లో గుట్టుగా వ్యభిచారం సాగుతుందని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఆగ్రా ఏఎస్పీ రవీనా త్యాగి కొందరు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి హోటల్‌లో ఆకస్మికంగా దాడులు చేశారు. పలువురు అమ్మాయిలతోపాటు ఐదుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానికంగా ఉండే ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థినిలుగా గుర్తించారు. అమ్మాయిలు ఏడురోజులపాటు వ్యభిచారం సాగించేందుకు రూ.20వేల కాంట్రాక్టుపై వచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అమ్మాయిలు ఏడురోజులపాటు వ్యభిచారం సాగించేందుకు రూ.20 వేల కాంట్రాక్టుపై వచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది.వీరిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు హోటల్ యజమానురాలైన వితంతువు తన కొడుకు, కూతురుతో కలిసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తుందని వెల్లడైంది.