గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అల్లాడుతున్న కేరళ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. “మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేద”ని పేర్కొంది. ఇప్పటికే గత రెండరోజులుగా వర్షాలు నెమ్మదించడంతో సహాయక చర్యలకు కూడా వాతావరణం పూర్తిగా సహకరిస్తోంది. మళ్లీ రానున్న నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం లేదనే వార్తతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే కోజికోడ్, కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలంతా కేరళలో వాతావరణ పరిస్థితులు మెరుగుపడాలని తమ ఇష్టదైవాలకు ప్రార్ధిస్తున్నారు.
