తాజాగా యుగోవ్ సంస్థ నిర్వహించిన ప్రజలు మెచ్చిన వ్యక్తుల సర్వేలో భారత మాజీ సారధి ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఇక మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ మరియు సచిన్ టెండూల్కర్ ను పక్కకి నట్టేసి పైకి ఎకబాకాడు. ఓవరాల్ గా ఈ సంస్థ 41 దేశాల్లో 42,000 మంది అభిప్రాయలు స్వీకరించగా ఇందులో మగ, ఆడ కేటగిరీలుగా విభజించారు. ఇందులో మోడీ మొదటి స్థానంలో ఉండగా అటు లేడీస్ లో మేరీ కోమ్ మొదటి ప్లేస్ దక్కించుకుంది. మోడీకి 15.66 శాతం రేటింగ్ రాగా, ధోనికి 8.58 శాతం వచ్చింది. ఇక సచిన్ కు 5.81, కోహ్లికి 4.46 రేటింగ్ వచ్చాయి. లేడీస్ కేటగిరీలో మేరీ కోమ్ కు 10.36 శాతం రేటింగ్ వచ్చింది. తరువాత వరుసలో కిరణ్ బేడి, లతా మంగేష్కర్, సుష్మా స్వరాజ్ మరియు దీపికా పదుకొనే ఉన్నారు.
