ప్రధాని మోదీ మనకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా….కుర్తాతో నిండుగా కనిపిస్తారు.ఎప్పుడు చూసినా అదే మోడల్ డ్రెస్ లో కనిపిస్తారు. అలాంటిది మొదటిసారి పంచెకట్టులో కనిపించారు మోదీ. మహబలిపురం శోర్ ఆలయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు తమిళ సాంప్రదాయంలో స్వాగతం పలికారు మోదీ. ఇద్దరు కలిసి ఆలయ చారిత్రక కట్టడాలను చూశారు. ప్రస్తుతం మోదీ పంచె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
