యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం ఈ తీర్పును వెలువరించనుంది. అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ వెల్లడించారు. ఎవరైనా వాటిని మరొకరికి కాని, మరో గ్రూప్‌నకు కాని పంపిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
