తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 61 కోట్లతో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.అంతే కాకుండా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతకుముందు ఆయన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ అబిడ్స్ లో నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
