కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భౌరంపేట్ కు చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు భవన నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ రెడ్డి, సంఘం ప్రెసిడెంట్ మన్నె బాల్ రాజ్, శంభీపూర్ బాగయ్య, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.