Politics బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసింది అయితే జెండాను ఎగరవేసిన రోజే మిగిలిన పనులన్నీ ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా..అబ్ కీ బార్ కిసాన్ సర్కారే తమ నినాదమని ప్రకటించిన KCR.. తొలి నిర్ణయం కూడా రైతులకు సంబంధించే తీసుకున్నారు. అలాగే కిసాన్ సెల్‌ను నియమించారు. దీనికి అధ్యక్షుడిగా హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నాం సింగ్ ని నియమించారు. అలాగే జాతీయ అధ్యక్షుని హోదాలో ఈ నియామక పత్రాలపై తొలి సంతకం చేశారు KCR. గుర్నాం సింగ్ ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఈరోజు కార్యాలయం మొదటి రోజు సందర్భంగా.. మధ్యాహ్నం 12 గంటలకు SPరోడ్డులో పార్టీ ఆఫీస్‌కు వచ్చారు కేసీఆర్. రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం 12 గంటల 37 నిమిషాలకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి… మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ CM కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఈ ఇద్దరూ KCR వెంటే ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘం నాయకులు కూడా వచ్చారు.