Politics ఆంధ్రప్రదేశ్లో కాపులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. టిడిపి హయాంలో ఉన్నప్పుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమైన అంటూ స్పష్టం చేసింది..
ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది 2019 అసెంబ్లీలో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధమైన అంటూ తెలిపింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. అలాగే కాపు రిజర్వేషన్లపై చేసిన చట్టం ప్రస్తుతం చెల్లుబాటు అవుతుందని కూడా చెప్పుకొచ్చింది.. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా, ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధమేనని కేంద్రం వివరణ ఇచ్చింది..
2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు 103వ రాజ్యాంగ సవరణ చట్టం- 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని వివరించారు