Politics బీఆర్ఎస్ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ విస్తరించడానికి సిద్ధమవుతుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ పార్టీ నాయకుడిని నియమించడానికి సిద్ధమవుతున్నారు నాయకులు.. ఇప్పటికే ఎందరో పేర్లు వినిపిస్తూ ఉండగా.. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ IAS తోట చంద్రశేఖర్ పరిశీలనలో ఉన్నారు. అలాగే కెసిఆర్ సమక్షంలో సోమవారం ఈ పార్టీలో చేరనున్నారు చంద్రశేఖర్.. అలాగే మాజీ మంత్రి రావెల కిశోర్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరునున్నట్లు తెలుస్తుంది. వీళ్లిద్దరితో పాటు మరికొందరు మాజీ బ్యూరోక్రాట్లు, నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరతారని చెప్తున్నారు. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును ఎఫెక్ట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడ్ని చేస్తే కాపుల్లో కొందరు బీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇతను ఇంతకుముందు వైసీపీలో పని చేశారు 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ పరాశయం పాలయ్యారు ఆ తర్వాత జనసేనలో కూడా కొన్నాను యాక్టివ్ గా పని చేశారు..