తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు,దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అంకంపాలెం గ్రామంలో జాతీయ జెండాను మాజీమంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ జెండాను ఆ అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు.
అనంతరం పట్వారీగూడెం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి BRS పార్టీ జెండాను MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ….తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాక మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
వ్యవసాయం దండగ అన్న కాడనుంచి వ్యవసాయాన్ని పండగల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారని.కొన్ని పార్టీల నాయకులు కొంతమంది వచ్చి ఓట్లు వేయమని అడుగుతారని..ఎవరికి వెయ్యాలో ఎందుకు వెయ్యాలో అందరూ ఆలోచించాలని…..అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లే అని…రేపు మీ ఇళ్లకు వేరే పార్టీ వారు వచ్చి ఓటు అడిగితే ఎందుకు వెయ్యాలి అనే ప్రశ్న మీరు అడగాలని..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే అభివృద్ది నీ మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.