Home / 18+ / ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఏకంగా 5 కెమెరాలతో ఇది వినియోగదారుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి రాకముందే ఫోటోలు లీకయ్యాయి

తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న సమాచారం ప్రకారం ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ 5 రియర్‌ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9పై, గ్లాస్‌ బ్యాక్‌తో ఈ ఫోన్ రానుంది. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.6 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 4150 ఎంఏహెచ్ బ్యాటరీ.