Home / CRIME / “ఆపరేషన్ కైలా ముల్లర్” పేరు ఎందుకు పెట్టారు..?

“ఆపరేషన్ కైలా ముల్లర్” పేరు ఎందుకు పెట్టారు..?

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతున్న ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా సైన్యం మట్టుపెట్టిన సంగతి విదితమే. దాదాపు రెండు వారాల క్రితమే వాయువ్య సిరియాలోని ఒక గ్రామంలో బాగ్దాదీ ఉన్నాడని పక్కా సమాచారంతో అమెరికా సైన్యం దాడికి దిగింది. గ్రామంపై చక్కర్లు కొడుతున్న అమెరికా హెలికాప్టర్లను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగారు.

దీంతో వారందర్నీ అమెరికా సైనికులు మొదట ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖ ద్వారాన్ని బాంబులతో పేల్చేశారు. సైన్యం దాడిని తెలుసుకున్న బాగ్దాదీ వెంటనే రహాస్య సొరంగం మార్గం ద్వారా భూగృంహా(బంకర్)లోకి చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరివరకు అమెరికా సైనిక సేనలు,సైనిక శునకాలు తరిమాయి.

బయటపడే మార్గం లేకపోవడంతో తన బాడీకున్న బాంబుల జాకెట్ ను పేల్చుకుని మృతి చెందాడు. ఈ ఆపరేషన్ అంతటికి ఆపరేషన్ కైల ముల్లర్ అని పేరు పెట్టారు. అసలు ఈ పేరేందుకు పెట్టారు. ఈ కైలా ముల్లర్ ఎవరో తెలుసుకుందామా..?. బాగ్దాదీని పట్టుకోవడం కోసం బాగ్దాదీ చేతుల్లో చిక్కుకుని తీవ్ర చిత్ర హింసలకు గురై.. అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవహక్కుల కార్యకర్త 26ఏళ్ల యువతి పేరే కైలా ముల్లర్. ఈ యువతి పేరును ఈ ఆపరేషన్ కు పెట్టారు.