కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఇస్తున్న ఎస్పీజి భద్రత పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భద్రత తగ్గించలేదని ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు భద్రత తొలగిస్తున్నారు చెప్పాలన్నారు.. సోనియా కుటుంబానికి భద్రత తొలగించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటుగా హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరు వివరణ ఇవ్వకపోవడం స్పందించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు.. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
