Home / NATIONAL / కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. ఏ పార్టీ తరపునో తెలుసా.?

కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. ఏ పార్టీ తరపునో తెలుసా.?

కర్ణాటక ఉప ఎన్నికలకు అతి తక్కువ గడువు ఉన్న నేపథ్యం ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. మొత్తంగా 15 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 15 స్థానాలకు గాను 353 నామినేషన్ పాత్రలు దాఖలయ్యాయి.రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్‌– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలు బరిలో ఉండటంతో ముఖ్యమంత్రి  యడియూరప్ప ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనర్హత ఎమ్మెల్యేల గెలుపుతో పాటు ప్రభుత్వ మనుగడకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు . సీఎం బెంగళూరులోని యశవంతపున నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్‌టీ సోమశేఖర్‌ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

 

 

ప్రతిపక్షాలు అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్‌  తీవ్రంగా   శ్రమిస్తున్నాయి.  సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్‌ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచార భాద్యతలు  నిర్వహిస్తున్నారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్‌ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో అభిమానులు తరలిరావడం పార్టీ వర్గాలలో ఉత్సాహం నెలకొంది.

 

 

యడియూరప్ప ప్రచారంలో వరాల హామీలను గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకపార్టీ మీద మరొకపార్టీ అవినీతి ఆరోపణలతో తీవ్ర విమర్స్యలతో ప్రచారం జరుగుతుంది. కొందరు మఠాల చుట్టూ  దేవాలయాల చుట్టూ ప్రదక్షణలు పూజలతో ఎలాఐనా గెలవాలని మొక్కులు మొక్కుతున్నారు. ఇదిలా ఉండగా ఏపార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని బెట్టింగులు కూడా జరుగుతున్నాయని సమాచారం.