భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పశ్చిమ బాంద్రాలోని వీధులను సచిన్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మేమంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయాలి.’ అని సచిన్ అభిమానులను కోరాడు.
‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ప్రధాని మోదీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మోదీ తలపెట్టిన కార్యక్రమం నచ్చి కొందరు తారలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు.
