దేశంలోని ఐఏయస్ అధికారులు కూడా అక్రమ సంపాదనకు అలవాటు పడి, అవినీతికి పాల్పడుతూ. బ్యూరోక్రాట్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఈ రోజుల్లో కొంత మంది అధికారులు మాత్రం నీతి, నిజాయితీగా వ్యవహరిస్తున్నారు..అలాంటి వారిలో మంగేష్ గిల్డియాల్ ఒకరు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు..ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న మంగేష్‌ను అక్కడనుంచి బదిలీ చేసినప్పుడు వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు..అంతలా ప్రజల మనసులను చూరగొన్నారు మంగ్లేష్. ఇప్పుడు రుద్ర ప్రయాగ కలెక్టర్‌గా తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తున్నారు..తాజాగా ఆయన తన భార్యతో చేయించిన ఓ పనికి దేశం యావత్తు ఫిదా అవుతుంది.. తాజాగా ఓ స్కూల్ తనిఖీకి వెళ్లిన మంగ్లేష్ అక్కడ సైన్స్ టీచర్‌లేక పిల్లలు ఇబ్బందిపడడం గమనించాడు. అప్పటికప్పుడు తన పరిధిలో కొత్త టీచర్‌ను అపాయింట్‌మెంట్ చేయడం ఆలస్యం అవుతుందని గమనించిన మంగ్లేష్ వెంటనే తన భార్య ఉషాను పిలిచి , కొత్త టీచర్ వచ్చే దాకా ఇక్కడ పిల్లలకు రోజూ వచ్చి సైన్స్ లెసెన్స్ చెప్పవచ్చుకదా డియర్ అని కోరాడు..అందుకు ఉషాకూడా ఏ మాత్రం బేషజం లేకుండా పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఒప్పుకుంది.. వృత్తి పట్ల అంకితభావంతో ప్రజా సేవలో మమేకమైన ఈ భార్యాభర్తలను చూసి దేశం ఫిదా అవుతుంది.తన భార్యను ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పాఠాలు చెప్పించిన ఈ యువ ఐఏయస్ అధికారికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
