బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది . అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక వ్యాపారుల దగ్గర నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర తగ్గినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. రూ.275 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,275గా పలికింది.మరోవైపు వెండి ధర కుడా తగ్గింది .525 తగ్గడంతో వెండి ధర రూ.40వేల మార్కు దిగువకు చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,925గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.04శాతం తగ్గడంతో ఔన్సు 1,265.70 డాలర్లు పలికింది.
