సామాన్యుల పట్ల కొందరు పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఓ మహిళ కారు వెనుక సీటులో కూర్చొని తన ఏడు నెలల పసికందుకు పాలు ఇస్తుండగా ముంబైలోని ఓ ట్రాఫిక్ పోలీసు అతి క్రూరంగా ప్రవర్తించాడు. నిబంధనలకు విరుద్ధంగా కారును నిలిపారంటూ ఆ కారుకు ఇనుప గొలుసు తగిలించి ట్రాఫిక్ వాహనంతో లాక్కెళ్లాడు. తనకు జ్వరం వచ్చిందని ఆ మహిళ చెప్పినా, డాక్టర్ సర్టిఫికెట్లు చూపినా ఆ పోలీసు కనికరించలేదు. కారు డ్రైవర్ అభ్యర్థించినా వినలేదు. అలాగే ముందుకుసాగాడు. కారులో మహిళ, పసికందు అలాగే ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ మహిళ ఏడుస్తూ పసికందుకు పాలిస్తూ అలాగే కూర్చున్నారు. రోడ్డు పక్కన వెళ్లేవాళ్లు ఆమె బాధను చూసి వాహనాన్ని ఆపాలంటూ ట్రాఫిక్ పోలీసుకు సూచించినా అతడు పట్టించుకోలేదు. శుక్రవారం ముంబైలోని మలాద్‌లో జరిగిన ఈ దారుణ సంఘటనను ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసు జాయింట్ కమిషనర్(ట్రాఫిక్) అత్యవసర విచారణకు ఆదేశించారు.
Car was towed by Traffic Police while the women with her 7 years old baby was sitting in the car.
(Her FB Live)
Yesterday at SV Rd, Malad.@MumbaiPolice plz look into the matter.@PreetiSMenon @aartic02 @neo_pac @tarsemkpahi @Georgekurian4K @RidlrMUM @smart_mumbaikar pic.twitter.com/ZVPtSYYFdM— Muzzammil Hamidani (@MuzzammilAap) November 11, 2017