విశ్వసనీయత, కచ్చితత్వానికి మారుపేరు అని చెప్పే ప్రముఖటీవీ చానల్ ” బీబీసీ” ఓ లైవ్ కార్యక్రమంలో వచ్చిన శబ్దాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ శబ్దాలు సాంకేతిక లోపాల వచ్చినవి కావు. నీలిచిత్రాల్లోని మహిళలు చేసే శబ్దాలు! సంబంధిత వీడియో ప్రకారం.. బీబీసీకి చెందిన పొలిటికల్ అంశాల పాత్రికేయురాలు ఎమ్మా వార్డే.. వెస్ట్‌మినిస్టర్ రోడ్డుపై నిలబడి లైవ్‌లో సమాచారం అందిస్తోంది. అయితే లైవ్ మొదలైనప్పటి నుంచి పోర్న్ వీడియోల్లోని మహిళల అరుపులు వినిపించాయి. ప్రస్తుతం ఈ విడియో వైరల్ గా మారింది .
