Home / NATIONAL / రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త ..

రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త ..

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే ను బలోపేతం చేయడానికి ..అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది .

అందులో భాగంగా జర్నీ చేసే సమయంలో రైల్వే టికెట్లను మరింత సులభతరం చేసేవిధంగా ప్రణాలికలను సిద్ధం చేసింది .
దీంతో టికెట్లను బుక్ చేసుకోవడానికి కేంద్రం భీమ్ ,యూపిఐ యాప్ ల ద్వారా చేసుకునే సదుపాయాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది .

డిజిటల్ లావాదేవిలను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ తరహ చర్యలను తీసుకుంది అని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు .అయితే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే కౌంటర్ల దగ్గ్గర నేటి నుండి అంటే శుక్రవారం నుండి యూపిఐ ద్వారా చెల్లింపు చేయనున్నట్లు ఆ అధికారి మీడియాకు వివరించారు .అయితే ఇకనుండి ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం క్రెడిట్ ,డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం లేదని వివరించారు .