దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్, కచ్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. గుజరాత్ లో బీజేపీ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
