2012లో పోర్న్ పరిశ్రమలోకి ప్రవేశించిన మియా మాల్కోవాపై, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానికి కారణం సన్నీ లియోని తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న రెండో పోర్న్ స్టార్ మాల్కోవా. మియా మాల్కోవా తో వివాదాల దర‌్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన శృంగార చిత్రం పేరు ‘గాడ్… సెక్స్ అండ్ ట్రూత్’. ఈ నెల 26న విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం ట్రైలర్‌లో మాల్కోవా మహిళల శరీరం గురించి, శరీర వాంఛల గురించి మాట్లాడారు. ట్రైలర్‌లో మాల్కోవా ఒక చోట, ‘మహిళ ఒకరి సొత్తు కాదు’ అంటారు.లైంగిక శాస్త్ర దృక్పథం నుంచి ఇది ఒక సంచలనాత్మక చిత్రం అవుతుందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.”ఇది సెక్స్ వెనుక ఉన్న నిజాలను గురించి దేవుని ఆలోచనలను తెలియజేస్తుందని అయన అన్నారు. ఇంకా ఆమె మాటల్లో… ఒకరి ముందు నగ్నంగా నిలబడవలసిన రోజు వస్తుందని మియా మాల్కోవా ఎప్పుడూ అనుకోలేదట. ‘‘ఎవరితోనైనా నేను శృంగారంలో పాల్గొనడానికి సిద్ధమే. ఈ రంగంలో ఉన్నందుకు నేనేమీ సిగ్గు పడడం లేదు. నాకు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉంది. వీలైనంత కాలం శృంగార చిత్రాల్లో నటించాలనుంది. ఇందులో ఎంతో ఆనందం ఉంది. పోర్న్ ఫిల్మ్స్ వదిలేయాలని అనుకోవడం లేదు. మరో ఉద్యోగంలో నన్ను నేను ఊహించుకోలేను. మెయిన్ స్ట్రీమ్ చిత్రాలపై నాకు ఆసక్తి లేదు. ఐ లవ్ పోర్న్’’ – అని ఐదేళ్ల క్రితం మియా అన్నామాటలు ఇవి. అప్పుడు చెప్పినట్టుగానే ఆమె ఇంకా శృంగార చిత్రాల్లో నటిస్తున్నారు.
