క్రైస్తవుల పవిత్ర దినము ఈస్టర్ ముందు రోజున చర్చీలలో గంటలు మోగకపోవడానికి కారణం ఇదే..!! అవును, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్ పండుగకు ముందు రోజున చర్చీలలో గంటలు మోగవు. అయితే, ఈస్టర్ దినమునకు ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్‌ఫ్రైడే అంటారు. అంతేకాకుండా, యేసు క్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచిన రోజుగా ఈస్టర్‌ను జరుపుకుంటారు. ఆ దినమును గుర్తు చేసుకుంటూ గుడ్‌ఫ్రైడే రోజుతోపాటు ఈస్టర్ పండుగ రోజున క్రైస్తవులందరూ చర్చీలలో దైవమందు మనస్సును లగ్నంచేసి ప్రార్ధనలు చేస్తారు. అంతేకాకుండా, గుడ్‌ఫ్రైడే నాడు చర్చిలలో ఉంచిన శిలువను క్రైస్తవులు తాకి, కన్నీటి పర్యంతంతో ముద్దాడుతారు.
అనంతరం ప్రతీ చర్చీలోనూ ఆ రోజుకు సంబంధించిన బైబిల్ ప్రవచనాలను క్రైస్తవ సోదరులకు మత పెద్దలు ఉపన్యసిస్తారు. క్రైస్తవులు యేసు క్రీస్తును స్మరించుకుంటారు. క్రీస్తు ప్రజల కోసం భూ రాక, అలాగే, యేసు క్రీస్తు మహిమలను గుర్తు చేసుకుంటూ క్రైస్తవ ధర్మాన్ని పాటించే ప్రతీ ఒక్కరు గుడ్‌ఫ్రైడే నాడు ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత రాత్రి 12 గంటల సమయంలో నిర్వహించే ప్రార్థనల్లో యేసు క్రీస్తును స్తుతిస్తూ స్మృతి పథాన్ని మత పెద్దలు ఉపన్యసిస్తారు. గుడ్‌ఫ్రైడే దినమున యేసు క్రీస్తు శిలువ వేయబడ్డాడు కాబట్టి..ఆ రోజంతా ఏ ప్రార్థనా మందిరాల్లోనూ గంటలు మోగవు.