ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో భాగంగా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి దేవినేని రాక సందర్భంగా అత్యుత్సాహ పడిన టీడీపీ నేతలు భారీ సౌండ్ సిస్టమ్స్‌కు తోడు భాజా భజంత్రీలు ఏర్పాటు చేశారు.
ఏరువాక కార్యక్రమం ముగిసిన తరువాత ఫోటోలకు ఫోజులిచ్చే క్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కాడెద్దలను కట్టిన నాగలి వద్దకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా కాడెద్దులు బెదిరాయి. అసలే సౌండ్ సిస్టమ్ ఎక్కువగా ఉండటంతో కాడెద్దెలు ఒక్క ఉదుటన మంత్రి వైపుగా వచ్చి కుమ్మాయి. దీంతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఒక్కసారిగా నేలకొరిగారు. వెంటనే తేరుకున్న టీడీపీ శ్రేణులు మంత్రిని పైకి లేపి, ఆయనతోపాటు గాయపడిన పలువురిని ఆస్పత్రికి తరలించారు.
ఆ కామెంట్లను పరిశీలిస్తే..
1) పేదల కోసం ఏమీ చేయకుండా.. చేసినట్టు ఫోజులిస్తే ప్రకృతి కూడా సహకరించదు.
2) ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాలను చూసి.. ప్రకృతి కూడా సహకరించడం లేదు.
3) టీడీపీ ప్రభుత్వమంటే.. మూగ జీవాలకు కూడా ఇష్టం లేదు.
4) గాడిద పని గాడిదే చేయ్యాలి కుక్క పని కుక్కే చేయ్యాలి పబ్లిసిటీ కోసం మీడియా ను పోగేసి ఏరువాక పేరు చెప్పి సంవత్సరానికి ఒకసారి ప్రజాధనాన్ని వృధా చేస్తు ఇలాగే ఏసాలేస్తే మూతి పళ్లు రాలేలా ఎద్దులు తన్నవా మరీ. వీళ్లు వీళ్ళ యేసాలు ఇదేం ఖర్మరా బాబు.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.