మణిరత్నం, పరిచయం అక్కర్లేని పేరిది. భారతీయ చిత్ర ముఖ చిత్రాన్ని మార్చిన దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా క్రేజీ క్రియేటివితో దర్శకుడిగా దూసుకుపోవడం మణిరత్నం సొంతం. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీ.. బిజీగా గడుపుతున్నాడు. అయితే, మణిరత్నంకు ఆరోగ్యం బాగోలేదని, హార్ట్ ఎటాక్ వచ్చిందని గురువారంనాడు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై మణిరత్నం వెంటనే స్పందించారు.
మణిరత్నంకు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదు. రెగ్యులర్‌గా ఆయన హెల్త్ చెకప్ చేయించుకుంటుంటారు. అలాగే, గురువారం కూడా చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు వెళ్లాడు. అది చూసి మణిరత్నంకు హార్ట్ ఎటాక్ అంటూ బయటకు వచ్చేసింది. గతంలో స్ర్టోక్ రావడం వల్ల ప్రతీ ఆరు నెలలకోసారి ఆయన హెల్త్ చెకప్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా హెల్త్ చెకప్ కోసమే వచ్చింది కానీ, మణిరత్నంకు ఏమీ కాలేదని, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు ఆయన బంధువులు. మణిరత్నం ప్రస్తుతం నవాబ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అతిధిరావు వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.