వరదలతో నష్టపోయిన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 71కోట్లు సహాయం చేసారు. 21 కోట్లు చెక్ ను ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు అందజేశారు. అలాగే వరద బాధితులకు అవసరమైన రూ.50 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేశారు. ముందగా కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నీతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వర్షాలకారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఎంతో మంది ఆ వరదల్లో కొట్టుకుపోయారని తెలుసుకుని బాధపడ్డారు. ఈ వరదల్లో 400 మందికి పైగా మృత్యువాత పడగా వేలమందికి గాయాలయ్యాయి.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
