Home / Uncategorized / విద్యార్థినిపై అత్యాచారం… వంకలో ముక్కలు ముక్కలుగా ఎముకలు

విద్యార్థినిపై అత్యాచారం… వంకలో ముక్కలు ముక్కలుగా ఎముకలు

వంకలో ముక్కలు ముక్కలుగా లభించిన ఎముకలు పాఠశాల విద్యార్థిని సరితవిగా ఆమె తల్లిదండ్రులు సోమవారం నిర్ధారించారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్లు అనుమానంతో గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పళ్లిపట్టు సమీపంలోని కీచ్చళం గ్రామానికి సమీపంలోని కాలువలో ముక్కలు ముక్కలుగా ఎముకులు పక్కనే విద్యార్థిని యూనిఫాం గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. అనుమానంతో ఐదు నెలల కిందట అదృశ్యమైన కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ చదువుకునే కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమార్తె సరిత తల్లిదండ్రులను అక్కడికి పిలిపించారు. ఆ ఎముకులు, యూనిఫాం, వెంట్రుకలకు కట్టిన రిబ్బన్‌ చూపించారు. దీంతో తమ బిడ్డవిగా వారు అనుమానం చెందారు. ఈ సంఘటకు సంబంధించి ఎస్పీ పొన్ని సైతం సంఘటన స్థలంలో పరిశీలన చేపట్టి గ్రామీణులతో మాట్లాడారు. సోమవారం 50 మంది పోలీసులు వంకలో పూర్తిగా వెతకగా చొక్క, ప్యాంటు లభించాయి. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం వైద్యుల బృందం ఎముకులు దొరికిన వంకలో తవ్వి చూడగా చెవి కమ్మలు, కాలు గొలుసులను గుర్తించారు. దీంతో మృతి చెందింది సరితగా నిర్ధారించారు. విద్యార్థిని సరిత మృతికి సంబంధించి తిరుత్తణి డీఎస్పీ శేఖర్‌ పర్యవేక్షణలో ఐదు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ముందుగా విద్యార్థిని తల్లిదండ్రులను విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గ్రామానికి చెందిన జగదీష్‌నాయుడు సహా మరో ఇద్దరిని విచారిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat