పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి అతివాద మూకలకు.. పాక్ సైన్యానికి దురదృష్టవశాత్తు భారత వీర జవాన్… ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడులను తిప్పి కొడుతున్న క్రమంలో ఆయన నడుపుతున్న విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాలతో బయట పడిన ఆయన… అక్కడి మూకలకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రాణాలతో తిరిగి వెనక్కు తీసుకురావాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాక్ సేనలను తరిమి కొట్టైనా.. వీర జవాన్ అభినందన్‌ను విడిపించాలి. 120 కోట్ల మంది భారతీయుల కోసం రక్తం చిందిన మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తోంది. మీ రాక కోసం ఎదురు చూస్తోంది. మీరు క్షేమంగా భారత్ తిరిగి రావాలని కోరుకుంటుంది.
