ఇదేదో ఫైర్ సేఫ్టీ డ్రిల్ అనుకోకండి. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి సిలిండర్లు పేలిపోతాయేమోనని బాధితులు హడలిపోతుంటే.. ఓ పోలీస్ అధికారి ధైర్యంగా ఇంట్లోకి వెళ్లి.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రెండు సిలిండర్లను బైటకు తీసుకొచ్చాడు. భారీ ప్రమాదాన్ని తప్పించిన ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ ను గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందించారు. మంటల్లో కూడా ఇంట్లోకి వెళ్లి అందర్నీ కాపాడిన రియల్ హీరో అంటూ కీర్తించారు. ఈ ఘటన గ్రేటర్ నొయిడా ప్రాంతంలో జరిగింది.
